నీట్ పరీక్షలో గిరిజన గురుకుల విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థుల కలను నిజం చేసేందుకు కేజీ టూ పీజీ విద్యను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నీరవ్ కోసం జైలు బ్యారక్ నెం.12 సిద్ధం