Minister Jagdish Reddy Fires on BJP: దేశ రాజకీయాల్లోకి రాకుండా కేసీఆర్‌ను కట్టడి చేసేందుకు భాజపా కుట్రలు పన్నుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టు ఆశ చూపి.. కొనుగోలు చేశారని విమర్శించారు. ఈ క్రమంలోనే మూడేళ్లుగా భాజపాతో టచ్‌లో ఉన్నట్లు రాజగోపాల్‌రెడ్డే ఒప్పుకున్నారన్న మంత్రి.. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తెచ్చారని ఆరోపించారు. ఏళ్ల గోస తీర్చిన తెరాస వైపు మునుగోడు ప్రజలు నిలబడతారని జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన కుటుంబ స్వార్థం కోసం తనను తాను బేరం చేసుకున్నారు. స్వయంగా వారు చెప్పిన మాటల ప్రకారమే భాజపాతో టచ్‌లో ఉన్నాను అని చెప్పారు. వాస్తవానికి ఎవరు ఇంత నిస్సిగ్గుగా, ఇలా బహిరంగంగా ఒక పార్టీలో ఉండి నేను ఇంకో పార్టీలో ఉన్నానని చెప్పడం.. అది నిజంగా దిగజారుడు రాజకీయం. ఆరు నెలల క్రితమే ఈ టెండర్ ఫైనల్ అయ్యిందని చెప్పి.. చిన్న కంపెనీ నాకంత లేదు అని చెప్పిన వ్యక్తి.. ఇంత చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ రావడం వెనుక ఏ మతలబు ఉంది. తన సొంత లాభాన్ని తాను చూసుకున్నాడు. భాజపా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కుటుంబం దొరుకుతుంది అని కొనుక్కున్నారు. కేసీఆర్‌కు ఉప ఎన్నిక సృష్టించడం ద్వారా జాతీయ రాజకీయాల వైపు వెళ్లే ఆలోచనను కొంత వరకు నిలుపుకుంటారని ఈ ఎన్నిక తెచ్చారు. - జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: