ETV Bharat / state

'ఇది ప్రజాస్వామ్యానికి హానికరం.. రాజకీయ పరంగా వారికి నష్టం'

minister jagadish reddy fires on governor: గవర్నర్ తమిళిసై పై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్లులను పెండింగ్​లో ఉంచే అధికారం అమెకి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజాస్వామిక ప్రభుత్వ చట్టాలను నిలువరించే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. రాజ్యాంగాన్ని అతిక్రమించినట్లు అనినిపిస్తే అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు ధర్మసనానికే ఉందని స్పష్టం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం తూట్లు పెట్టేలా ఉందని విమర్శించారు. శాసనసభలో ఒకలా... రాజ్ భవన్​లో మరోలా మాట్లాడుతున్న గవర్నర్ చర్యలు , గవర్నర్​ను అడ్డుపెట్టి కేంద్రం ఆడుతున్న నాటకంగా మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.

minister jagadish reddy fires on governor
'ఇది ప్రజాస్వామ్యానికి హానికరం.. రాజకీయ పరంగా వారికి నష్టం'
author img

By

Published : Apr 11, 2023, 8:26 PM IST

minister jagadish reddy fires on governor: రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్​గా కాకుండా బీజేపీ కార్యకర్త తరహాలో పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక పద్దతిలో ఎన్నికయిన ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అడ్డుకునే అధికారం అమెకి ఎక్కడిదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. రాజ్యాంగ మూల సూత్రాలను కాదని చట్టాలు రూపొందిస్తే అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు ధర్మసనానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిండు సభలో శాసనసభ్యుల ఆమోదంతో రూపొందించిన చట్టాలను నిలువరించే హక్కు గవర్నర్​కు ఎక్కడిదని ఆయన నిలదీశారు.

ప్రపంచానికి స్ఫూర్తిదాయకం: యావత్ ప్రపంచానికి భారత పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం స్ఫూర్తిదాయకంగా నిలిస్తే మోదీ సర్కార్ దాన్ని తూట్లు పొడుస్తుందంటూ ఆయన మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు అని ఆయన పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో ఇది భాగమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్​లో పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర శాసనసభలో ఒకలా.. రాజ్ భవన్​లో మరోలా ప్రవర్తించడం గవర్నర్ తమిళిసైకే చెల్లిందన్నారు. నిన్న గాక మొన్న నిండు సభలో తెలంగాణా అభివృద్ధిని స్వయంగా కొనియాడిన గవర్నర్ తమిళిసై రాజ్​భవన్​కు వెళ్లగానే అదే సభలో ఆమోదించిన పద్దులను పెండింగ్​లో పెట్టడమే ఇందుకు తార్కాణమన్నారు.

బీజేపీకి నష్టమే: బీజేపేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలలో గవర్నర్​ను కేంద్రం బీజేపీ కార్యకర్తలాగా వినియోగించుకుంటుందన్నారు. అది రాజకీయ పరంగా బీజేపీకి నష్టమే కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు శాసనసభ సమావేశాల్లో ఇదే అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీర్మానం చేసింది అంటే కేంద్రం వైఖరి ఏమిటో బట్టబయలు అయిందన్నారు. గవర్నర్​ను అడ్దు పెట్టుకుని కేంద్రం ఆడుతున్న దుర్మార్గమైన నాటకానికి ఇది నిదర్శనంగా మారిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమంతో పరుగులు పెట్టిస్తుంటే తట్టుకోలేక బీజేపీ ఈ డ్రామాలను తెర లేపిందని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాల డిమాండ్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో వస్తున్నందునే ఇటువంటి కుట్రలకు బీజేపీ రూట్ మ్యాప్ గీసిందని ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే బీజేపీయేతర రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి మోదీ సర్కార్​కు కంటగింపుగా మారినందునే... రాజ్​భవన్​లను అడ్డుపెట్టుకుని గవర్నర్​లతో బీజేపీయేతర రాష్ట్రాల్లో శాసన సభలో ఆమోదించిన బిల్లులను పెండింగ్​లో పెడుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ కార్యకర్తలుగా, నాయకులుగా వాడుకుంటోంది. దీని మీద స్పష్టంగా తమిళనాడు ప్రభుత్వం శాసన సభలోనే తీర్మానం చేసింది. గవర్నర్లు సంతకం పెట్టడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పి సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రజాస్వామిక బద్దంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు శాసనసభలో చేసిన చట్టాలని అడ్డుకోవడం అనేది గవర్నర్ల బాధ్యత కాదు"- జగదీష్​ రెడ్డి, విద్యుత్​ శాఖ మంత్రి

'ఇది ప్రజాస్వామ్యానికి హానికరం.. రాజకీయ పరంగా వారికి నష్టం'

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.