అసెంబ్లీలో విద్యుత్ పద్దు చర్చలో భాగంగా పాతబస్తీ విద్యుత్ సమస్యలపై ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలు సభలో మాట్లాడారు. సభ్యులు మాట్లాడిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సమావేశమవుదామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో హామీ ఇచ్చారు.
హామీ మేరకు ఇవాళ సభ ముగిసిన వెంటనే ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలతో మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, సీఎండీ ప్రభాకరరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించి... త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు.
ఇదీ చూడండి: ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ విధించం: సీఎం కేసీఆర్