నెహ్రూ జంతు ప్రదర్శనశాల వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను.. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. నెహ్రూ జులాజికల్ పార్క్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని.. ఇందులో పొందుపరిచారని తెలిపారు. జంతు ప్రేమికులు కూడా... జంతువుల దత్తత వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
సందర్శకులు ఆన్‌లైన్‌లో జంతు ప్రదర్శనశాల ప్రవేశ టిక్కెట్లతోపాటు... ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చని వివరించారు. సెంట్రల్ జూ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం సందర్శకులకు అనుమతిచ్చిన తర్వాతే... ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : ఓవైపు సిబ్బందితో శ్రమదానం.. మరో వైపు ఆదాయం