ETV Bharat / state

Niranjan Reddy: 'నానో యూరియాను రైతులు విరివిగా వాడాలి'

రాష్ట్రంలో నానో యూరియాను రైతులు విరివిగా వాడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్​లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమావేశంలో గుజరాత్‌లోని కలోల్ నుంచి తెలంగాణకు బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్‌ను ఆన్‌లైన్‌ ద్వారా జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.

nano urea
nano urea
author img

By

Published : Jul 16, 2021, 10:37 PM IST

భారతీయ రైతుల సొంత ఎరువుల సహకార సంస్థ ఇఫ్కోచే నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన నానో యూరియా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. ఇఫ్కో విడుదల చేసిన ఈ నానో యూరియా ప్రభుత్వాలకు ఎంతో రాయితీ భారం, రవాణా, నిల్వ ఖర్చులు తగ్గిస్తుందని చెప్పారు. గుజరాత్​ నుంచి తెలంగాణకు వస్తున్న నానో యూరియా ట్రక్​ను ఆయన ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు. ఒక్కో బస్తాపై రూ.800 నుంచి 1,000 వరకు ప్రభుత్వాలకు రాయితీ భారం తగ్గుతుందన్నారు. కేవలం రూ.240కు లభించే 500 ఎంఎల్ లిక్విడ్ బాటిల్ బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇఫ్కో ఈ ఘనత సాధించడం గర్వించదగ్గ విషయమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మొదటి సారిగా ఈ నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ కలిగి ఉండడం సంతోషకరమని అన్నారు.

సమర్థతతో పాటు.. అధిక దిగుబడి

ప్రస్తుతం యూరియా వల్ల భూమి, నీరు, గాలిలో అవుతున్న కలుషితాన్ని... నానో యూరియా నివారించి పర్యావరణం కాపాడుతుండడం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థ నుంచి ఇలాంటి పరిశోధనా ఉత్పత్తి రావడం ఆహ్వానించదగిన పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ఏ పంటకైనా పూత కంటే ముందు విత్తనం వేసిన 20 రోజుల తర్వాత యూరియాకు ప్రత్యామ్నాయంగా రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చని అన్నారు. సాధారణ యూరియాకు 30 శాతం సమర్థత ఉంటే నానో యూరియా 80 శాతం సమర్థంగా ఉండడంసహా 8 శాతం దిగుబడి పెరుగుతుందని ఐసీఏఆర్ పరిశోధనల్లో వెల్లడైందని... పంట ఉత్పత్తుల నాణ్యత కూడా అధికంగా ఉంటుందని తెలిపారు.

నానో యూరియాకు మారాలి

ప్రస్తుతం వాడుతున్న యూరియా కన్నా తక్కువ మోతాదు, తక్కువ ధరలో అధిక ఫలితాలు నానో యూరియా ఇస్తుందని నిరూపితమైనందున ఇది పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వాడుతున్న యూరియా వాడకం 50 శాతం వరకు తగ్గుతుందన్నారు. రసాయన ఎరువుల నియంత్రణ చట్టం కింద ఆమోదం పొందిన ఈ నానో యూరియా క్షేత్ర స్థాయిలో రైతులందరికీ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో సంస్థ ఉపాధ్యక్షుడు దిలీప్ సంఘానీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇఫ్కో ఎండీ డాక్టర్ అవస్తీ, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, సీజీఎం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ముగిసిన ఖానామెట్‌ భూముల వేలం.. ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.