Harish Rao Speech In Plenary: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్ని కేంద్రంలోని భాజపా సర్కార్... పెట్టుబడిని మాత్రం రెట్టింపు చేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రాల ఆదాయానికి గండికొడుతూ... కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేనా వసూలు చేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెరాస ప్లీనరీలో హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టగా... ఎంపీ రంజిత్‌రెడ్డి బలపర్చారు. రాష్ట్రంలోని తెరాస సర్కార్ సంపదను పేదలకు పంచుతుంటే... కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సంపదను పెద్దలకు పంచుతోందని విమర్శించారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పింది. రైతుల పెట్టుబడిని మాత్రం భాజపా సర్కార్ రెట్టింపు చేసింది. రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండికొడుతోంది. సెస్‌ల రూపంలో వసూళ్లను మానుకోవాలి. సంపదను తెరాస సర్కార్ పేదలకు పెంచుతోంది. సంపదను పెద్దలకు పంచాలన్నదే భాజపా సిద్ధాంతం. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి... పెట్టుబడిని మాత్రం డబుల్ చేశారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి. ఇది తెరాస నినాదం. కానీ... కేంద్రంలో ఉండే భాజపా నినాదం పేదలను దంచాలి... పెద్దలకు పంచాలి. తెరాస పేదల వైపు ఉంటే... భాజపా పెద్దల వైపు ఉంది.
- హరీశ్‌రావు, మంత్రి
ఇవీ చదవండి :