రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు(harish rao on health profile) ఆదేశించారు. మొదట రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో వచ్చేనెల మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో హెల్త్ ప్రొఫైల్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని అధికారులకు హరీశ్ రావు(harish rao review on medical) స్పష్టం చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు, ఓఎస్డీ గంగాధర్‌లతో కూడిన కమిటీ ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించాలని సూచించారు. ఆయా జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ హెల్త్(telangana health profile) ప్రొఫైల్‌లో ప్రస్తుతం ఎనిమిది టెస్ట్‌లు చేస్తుండగా.. తెలంగాణ డయాగ్నోసిస్ ద్వారా 57 టెస్ట్‌లు చేయవచ్చని మంత్రి వెల్లడించారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు సూచించారు. నోడల్ అధికారులను నియమించి ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సమాచారం తీసుకోవాలని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ తయారీ వివరాలను మంత్రికి వివరించిన అధికారులు పరీక్షలు.. పూర్తైన వారి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. చాలా పకడ్బందీగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం చేపట్టాలని హరీశ్ రావు వివరించారు. పక్కా సమాచారం ఉంటే రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవలు అందించగలుగుతామని మంత్రి అన్నారు.
హైరిస్క్ వాళ్లను గుర్తించవచ్చు
పరీక్షలు పూర్తైన వారి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేస్తారని అందులో ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా నిక్షిప్తం చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రెండు జిల్లాల్లో ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, మధుమేహం, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన హై రిస్క్ వాళ్లను సులభంగా గుర్తించనున్నట్లు చెప్పారు.
సమాచారం పక్కాగా ఉండాలి
ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా.. ప్రమాదానికి గురైనా అతని ఆరోగ్య సమాచారం క్లౌడ్ స్టోరేజి నుంచి తెప్పించుకునేలా ఉండాలని హరీశ్ రావు సూచించారు. ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో చేపట్టే ఈ ఆరోగ్య సమాచార సేకరణ పక్కాగా ఉండాలని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ (health profile in telangana) సమాచారం పకడ్బందీగా సేకరిస్తే ప్రభుత్వం సమర్థవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని హరీశ్ రావు అన్నారు. పక్కా సమాచారం ఉంటే ఆయా ప్రాంతాల్లో అవసరమయ్యే వైద్య సేవలు, ఔషధాలు, వైద్య నిపుణులు, వైద్య ఉపకరణాల గురించి తెలుస్తుందని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: