కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో భాజపా ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని... గడిచిన ఆరేళ్లలో 12కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రలోని భాజపా ప్రైవేట్ పరం చేస్తూ.. ఉద్యోగులను తొలగిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి.. తనను గెలిపించి సేవచేసే అవకాశమివ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రబీలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు