ETV Bharat / state

సంక్షేమ శాఖలకు బడ్జెట్లో నిధులు అదనం - సంక్షేమ శాఖ బడ్జెట్​

సంక్షేమ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యతను కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి నిధులను పెంచింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా 32.53 శాతం అధికంగా... 31 వేల 338 కోట్ల రూపాయలను కేటాయించింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ పథకాల అమలుకు పెద్దమొత్తంలో నిధులను కేటాయించింది.

Minister Harish Rao introduced the welfare budget 2020
సంక్షేమ శాఖలకు బడ్జెట్లో నిధులు అదనం
author img

By

Published : Mar 9, 2020, 12:34 PM IST

సంక్షేమ శాఖలకు బడ్జెట్లో నిధులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం కన్నా వాస్తవిక బడ్జెట్లో 32.53 శాతం అధిక నిధులను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ. 31 వేల 338 కోట్లను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు నిర్వహణ, ప్రగతి పద్దుల కింద మొత్తం రూ. 10 వేల 771 కోట్ల 31 లక్షల విడుదల చేసింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.13 వేల 171 కోట్లను.. ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 7 వేల 396 కోట్ల 19 లక్షలు ఇచ్చింది.

⦁ ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 2 వేల 610 కోట్ల 19 లక్షలు

⦁ ఎస్టీ సంక్షేమ శాఖకు రూ. 2 వేల286 కోట్ల 24 లక్షలు

⦁ బీసీ సంక్షేమ శాఖకు రూ. 4 వేల 356 కోట్ల 82 లక్షలు

⦁ మైనార్టీకి రూ. 1518 కోట్లు

కల్యాణ లక్ష్మి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలుగా భావిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు కోసం గతేడాది కన్నా రూ. 700 కోట్లను అదనంగా ఇచ్చింది. రెండు పథకాలకు కలిపి బడ్జెట్లో రూ. 2 వేల 240 కోట్లను కేటాయించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధి కోసం పెరుగుతున్న దరఖాస్తులు దృష్టిలో పెట్టుకుని బీసీ సంక్షేమ శాఖకు సుమారు రూ. 650 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ. 40 కోట్లను విడుదల చేసింది.

గురుకులాలకు:

సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న గురుకుల విద్యాలయాలకు గతేడాది నిధుల కన్నా రూ. 215 కోట్లను అదనంగా ఇచ్చింది. మొత్తం రూ. 2 వేల 73 కోట్లు కేటాయించింది. ఎస్సీ గురుకులాలకు 100 కోట్ల రూపాయలు పెంచి... 878 కోట్ల 15 లక్షల రూపాయలను కేటాయించింది. గిరిజన గురుకులాలకు 738 కోట్ల రూపాయలను ఇచ్చింది.

బీసీ గురుకులాలకు తక్కువే

ఈ ఏడాది కొత్తగా 71 మైనారిటీ గురుకుల కళాశాలలు ప్రారంభం కానుండగా.. గతేడాది కన్నా రూ. 250 కోట్లను తగ్గించి.. 212 కోట్ల 98 లక్షల రూపాయలే కేటాయించింది. బీసీ గురుకులాలకు గతేడాది 265 కోట్ల రూపాయలను కేటాయించిన సర్కారు... ఈ ఆర్థిక సంవత్సరం నిధులు తగ్గించి కేవలం.. 243 కోట్ల 17 లక్షలకే పరిమితం చేసింది.

విదేశీ విద్యకు పెద్దపీట

విదేశీ విద్య పథకంలోనూ సర్కారు మైనారిటీలకు పెద్దపీట వేసింది. బీసీలకు నిధులను స్వల్పంగా తగ్గించి.. ఎస్సీ, ఎస్టీలకు యథాతథంగా ఉంచింది.

మొత్తం కేటాయించింది: 123 కోట్ల 54 లక్షల రూపాయలు కేటాయించింది.

మైనార్టీ విద్యార్థులకు: రూ. 62 కోట్ల 53 లక్షల రూపాయలు

బీసీలకు: రూ. 33 కోట్ల 53 లక్షలు..

ఎస్సీలకు: రూ.23 కోట్లు..

ఎస్టీలకు: రూ. 4 కోట్ల 48 లక్షలు ఇచ్చింది.

బోధన రుసుములు.. ఉపకార వేతనాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం 2 వేల 650 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. ప్రతీ ఏడాది బోధన రుసుములు, ఉపకార వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో.. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది 2 వేల 400 కోట్లు కేటాయించినప్పుటికీ... ఇప్పటి వరకు సుమారు 200 కోట్ల రూపాయలే వెచ్చించారు.

ఉపాధి పథకాల అమలకు

నాలుగు సంక్షేమ శాఖల ఆర్థిక సంస్థలకు కలిపి ఉపాధి పథకాల అమలకు ఒక వెయ్యి 15 కోట్ల 17 లక్షల రూపాయలను మాత్రమే కేటాయించింది.

⦁ ఎస్సీ కార్పొరేషన్​కు రూ. 224 కోట్లు

⦁ ఎస్టీ కార్పొరేషన్​కు రూ. 261 కోట్ల 66 లక్షలు

⦁ బీసీ సంస్థకు రూ. 500 కోట్లు

⦁ మైనార్టీ కార్పొరేషన్​కు రూ. 30 కోట్ల 51 లక్షలను ఇచ్చింది.

నిరాసే మిగిల్చిన నిరుద్యోగ భృతి..

తెరాస ఎన్నికల హామిల్లో ఒకటైన నిరుద్యోగ భృతి పథకం ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అమలు కావడం లేదు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులుంటారన్న అంచనాతో.. ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 1810 కోట్లు కేటాయించిన సర్కారు... పూర్తిస్థాయి బడ్జెట్​లో మాత్రం పక్కన పెట్టింది.

మొత్తంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేటాయించిన నిధులు ఆశాజనకంగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.