ETV Bharat / state

హైదరాబాద్​లో త్వరలోనే మరో నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులు: హరీశ్​రావు

author img

By

Published : Mar 4, 2023, 2:52 PM IST

Updated : Mar 4, 2023, 5:33 PM IST

Harish Rao in Nims Hospital: నిరుపేదలకు కార్పొరేట్‌ తరహా సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆర్థిక స్థోమత లేక నిరుపేదలు సంతానాన్ని కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేసిన ఆయన.. పేదల కోసం హైదరాబాద్​లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నిమ్స్​లో గుండె శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించిన యూకే డాక్టర్లను ఆయన సన్మానించారు.

Minister Harish Rao
Minister Harish Rao

Harish Rao in Nims Hospital: హైదరాబాద్​ నిమ్స్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 27 నుంచి నేటి వరకు గుండె శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించిన యూకే వైద్య బృందాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. అమెరికా, యూకే లాంటి దేశాల్లో స్థిరపడిన నిపుణులు తెలంగాణలో సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుట్టుకతో వచ్చే గుండె శస్త్ర చికిత్స శిబిరం నిమ్స్​లో విజయవంతమైందని ప్రకటించారు.

ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరికి గుండె సమస్య ఉంటుందని పేర్కొన్నారు. నిరుపేదలకు శస్త్రచికిత్స చేయించే ఆర్థిక స్థోమత ఉండటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది నిరుపేదలు సంతానాన్ని కోల్పోతున్నారని తెలిపిన మంత్రి.. నిరుపేదలకు కార్పొరేట్‌ తరహా సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆసుపత్రులు అభివృద్ధి చెందలేదని గుర్తు చేశారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్​లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. వచ్చే దసరాకు వరంగల్​లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అక్కడ ఆసుపత్రితో పాటుగా వైద్య విద్యను కూడా అందించి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆపరేషన్లు చేసే విధంగా అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్​లోని ఎల్బీ నగర్​, అల్వాల్, ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు ప్రారంభమైనట్లు వివరించారు. అంతేకాకుండా నిమ్స్​లో మరో 2 వేల పడకలతో విస్తరణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ వైద్యులు, శస్త్ర చికిత్స చేయించుకున్న పిల్లల తల్లిదండ్రులు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

"అమెరికా, యూకే లాంటి దేశాల్లో స్థిరపడిన నిపుణులు తెలంగాణలో సేవలందించేందుకు ముందుకు రావాలి. వైద్య రంగంలో కొత్త విజ్ఞానం, సాంకేతికత పరిజ్ఞానం అందించాలి. దిల్లీ ఎయిమ్స్ తర్వాత హైదరాబాద్ నిమ్స్​లో మాత్రమే తొలిసారి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2.5 కిలోల బరువు గల 3 మాసాల చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరికి గుండె సమస్య ఉంటుంది. ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది నిరుపేదలు సంతానాన్ని కోల్పోతున్నారు. దసరాకు వరంగల్​లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభిస్తాం."- హరీశ్​రావు, ఆరోగ్యశాఖ మంత్రి

హైదరాబాద్​లో త్వరలోనే మరో నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులు: హరీశ్​రావు

ఇవీ చదవండి:

సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు: హరీశ్​రావు

రేవంత్​రెడ్డి పాదయాత్రలో అపశృతి.. ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీ

భ్రష్టుపడుతోన్న రాజకీయాలను యువతే బాగుచేయాలి : వెంకయ్య నాయుడు

Last Updated : Mar 4, 2023, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.