Minister Harish Rao Fires On Amit Shah On Tweet X : ఖమ్మం బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవి కాదు.. సింగిల్ డిజిట్ సాధించేందుకు పోరాడండి అంటూ బీజేపీని విమర్శించారు. మీరు కుటుంబపాలన గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) అబద్ధపు విమర్శలు, అవుట్‌డేటెడ్ ఆరోపణలు చేశారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో రాజీలేని యోధుడు కేసీఆర్ అని ఎక్స్ వేదికగా(Twitter) ట్వీట్ చేశారు.
"మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించేదని" హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
-
మాకు నూకలు చెల్లడం కాదు..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి
బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…
">మాకు నూకలు చెల్లడం కాదు..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2023
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి
బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…మాకు నూకలు చెల్లడం కాదు..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 27, 2023
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి
బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…
"అలాగే 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీ లే. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్. అబద్ధపు విమర్శలు.. అవుట్ డేటెడ్ ఆరోపణలు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో హోంమంత్రి స్కిట్." - మంత్రి హరీశ్ రావు, ట్వీట్
అమిత్ షా ఖమ్మంలో బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు : కేసీఆర్ సర్కారుకు తిరోగమనం ప్రారంభమైందని.. ఇక నూకలు చెల్లాయని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని.. ఈసారి సీఎం కేసీఆర్.. కేటీఆర్ కాదు. బీజేపీ నేతనే అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 4జీ.. బీఆర్ఎస్ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలని అమిత్ షా ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు. తెలంగాణ విమోచన వీరులను కేసీఆర్ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మోదీ పార్టీనే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరెస్టులకు ఎప్పుడూ బీజేపీ భయపడలేదని గుర్తు చేశారు. సోనియాగాంధీ కోసం కాంగ్రెస్ పని చేస్తే.. కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ పని చేస్తుందని ఎద్దేవా చేశారు.