ETV Bharat / state

త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్​రావు

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయించారని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్​ విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

minister Harish Rao announces jobs to be filled soon in the telangana state
రాష్ట్రంలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్​రావు
author img

By

Published : Mar 25, 2021, 1:01 PM IST

రాష్ట్రంలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్​రావు

ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్​ నివేదికను పరిగణలోకి తీసుకుని.. 30 శాతం ఫిట్​మెంట్​ ప్రకటించామని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా వయో పరిమితి పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉందని గుర్తు చేశారు. వయసు పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదన్న మంత్రి.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.