MINISTER GUMMANURU SENSATIONAL COMMENTS: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చెయ్యలేడని.. బ్యాలెట్ పేపర్లో ఆయన పేరే ఉండదని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని సవాల్ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్‌కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామన్నారు.
ఇవీ చదవండి: