ETV Bharat / state

బీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్​ వైపు చూస్తున్నారు: గంగుల - భాజపా లక్ష్మణ్​పై మండిపడ్డ తెరాస నేతలు

దేశంలో బీసీలంతా కేసీఆర్​ వైపు చూస్తున్నారని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. బీసీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు రాష్ట్రంలో అమలుచేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దని గంగుల అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపామని గంగుల స్పష్టం చేశారు.

gangula kamalakar
బీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్​ వైపు చూస్తున్నారు: గంగుల
author img

By

Published : Sep 30, 2020, 3:50 PM IST

Updated : Sep 30, 2020, 6:12 PM IST

బీసీలకు కోకాపేటలో ఇళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి గంగుల కమలాకర్​ స్పష్టం చేశారు. కోకాపేటలోని ఎంతో విలువైన 80 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించారు. మార్కెట్‌ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దని గంగుల అన్నారు.

గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎంబీసీలను ఎప్పుడైనా పట్టించుకున్నాయా.. అని గంగుల నిలదీశారు. 36 కులాలను ఎంబీసీల్లో కలిపిన ఘనత తమ సర్కార్​దేన్నారు. ఎంబీసీలకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు.

బీసీలకు ఐదేళ్లలో 240 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు గంగుల తెలిపారు. సీఎం కేసీఆర్‌.. ఐదేళ్లలో 19 గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. 90 వేలమంది బీసీ విద్యార్థులకు చదువులు చెప్పిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా బీసీలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపామని గంగుల స్పష్టం చేశారు. సిరిసిల్లలో నేసిన చీరలను రూ.1,080 కోట్లతో కొనుగోలు చేశామన్నారు.

రాజాసింగ్​ స్వాగతించారు..

కేంద్రంలో బీసీ శాఖ పెట్టాలని తొలుత ముఖ్యమంత్రి కేసీఆరే కోరినట్లు మంత్రి గంగుల తెలిపారు. బడ్జెట్​లో​ కేటాయింపులు చేయాలని కోరామన్నారు. ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఉన్న లక్ష్మణ్​.. ప్రధాని మోదీని కలిసి బీసీల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని కోరాలని డిమాండ్​ చేశారు. తమను బీసీల్లో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్న 17 కులాలను కేసీఆర్ బీసీల్లో చేర్చారని.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ దాన్ని స్వాగతించారని గంగుల కమలాకర్ అన్నారు.

మోదీకే దూరమవుతున్నారు..

బీసీలు తెరాసకు దూరం కావడం లేదని.. మోదీకే అన్ని వర్గాలు దూరమవుతున్నాయన్న విషయం లక్ష్మణ్ గ్రహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా.. అని ప్రభుత్వ విప్​ వినయ్​ భాస్కర్ ప్రశ్నించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా నియమితులైన లక్ష్మణ్​.. బీసీల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ​

ఏం చేయగలరో చూడండి..

మరుగున పడుతున్న కుల వృత్తుల పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్​ ప్రభుత్వానిదని కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. భాజపాలో బీసీ సెల్​ డమ్మీ అని.. అందుకే లక్ష్మణ్​కు ఆ విభాగానికి అధ్యక్షుడిగా చేసినట్లు వివేకానంద విమర్శించారు. అనవసర విమర్శలు మాని.. లక్ష్మణ్​ ఏంచేయగలరో చేసి చూపించాలని వివేకానంద సూచించారు.

బీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్​ వైపు చూస్తున్నారు: గంగుల

ఇవీచూడండి: 'బీసీలకు అన్యాయం జరుగుతోంది.. వారిని సంఘటితం చేస్తా'

Last Updated : Sep 30, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.