ETV Bharat / state

'చిన్నచిన్న సాకులు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయమంటే తగదు'

author img

By

Published : Jun 8, 2022, 10:03 PM IST

Gangula On FCI: రాష్ట్రం పచ్చగా కలకలలాడుతోంటే చూస్తూ ఉండలేక కేంద్రం ఇబ్బందులు పెడుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. చిన్న చిన్న సాకులు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్​సీఐ ప్రతిసారి చెప్పడం తగదని ఆక్షేపించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Gangula On FCI
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
'రాష్ట్రం పచ్చగా కలకలలాడుతోంటే కేంద్రం ఓర్వలేక ఇబ్బందులు పెడుతోంది'

Gangula On FCI: కేంద్రం 53 లక్షల మందికి కార్డుదారులకు ఉచిత బియ్యం ఇస్తే... మిగిలిన 40 లక్షల మందికి సరఫరా చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ఈ దఫా కూడా తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రం పచ్చగా కలకలలాడుతోంటే ఓర్వలేకే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కుంటి సాకులు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్​సీఐ అనడం తగదని ఆక్షేపించారు. ఎఫ్​సీఐ ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన తోసిపుచ్చారు.

ధాన్యం సేకరణ వల్ల ఒక నెల ఆలస్యమైంది: కొవిడ్ లాక్​డౌన్ సమయంలో రూ.1,500 నగదు, ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం, నగదు ఇచ్చామన్న గంగుల... రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4,720 కోట్ల భారం పడినా మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం అందించారని వివరించారు. ఈ ఏప్రిల్ నుంచి మరో ఆర్నెళ్లు ఉచితబియ్యం ఇవ్వాలని కేంద్రం మార్చిలో లేఖ రాసిందన్న గంగుల... ఈ దఫా కూడా తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఉచితబియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ధాన్యం సేకరణ, ఇతర కారణాల వల్ల ఉచిత బియ్యం ఒక నెల ఆలస్యం అయిందన్న మంత్రి... కేంద్రం సెప్టెంబర్ వరకు చెబితే తాము నవంబర్ వరకు ఇస్తామని ప్రకటించారు.

ఎఫ్​సీఐ వాటిపై అధికారం లేదు: రైసుమిల్లుల్లో ఉండే వడ్లు, బియ్యంపై ఎఫ్​సీఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి అన్నారు. పదిమిల్లుల్లో మాత్రమే ధాన్యం తేడా ఉందని ఎఫ్​సీఐ చెబితే ఇప్పటికే మూడు మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టిందని.. మరో రెండు మిల్లుల నుంచి మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని కమలాకర్ వివరించారు. మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఒక్క పైసా కూడా వృథా కాకుండా చూస్తున్నామన్న ఆయన... మిల్లర్లు ఎవరైనా తప్పు చేస్తే ముక్కు పిండి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో లేనిది ఎఫ్​సీఐ ఇప్పుడే తెలంగాణపై ఎందుకు దాడి చేస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను మాని ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కనీస మద్దతుధరకు చట్టబద్ధత కావాలని తెరాస కోరుతోందన్న మంత్రి... పంటలు కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతుధర ఉంటే ఏం లాభమని కేంద్ర ప్రభుత్వాన్ని గంగుల ప్రశ్నించారు.

ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు: పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండి కూడా ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఇంధన కొరత లేకుండా చర్యలు చేపడుతామని.. అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయిల్ కంపెనీలు, డీలర్ల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పరిస్థితిని సమీక్షించారు. ఆయిల్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవన్న మంత్రి.. కంపెనీ యాజమాన్యం, డీలర్ల మధ్య వివాదంపై సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. అయినప్పటికీ నిత్యావసర వస్తువులైన పెట్రోల్, డీజిల్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతున్నామన్న గంగుల కమలాకర్... కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు

ఇవీ చదవండి: రైతుల ఆదాయం పెరిగేలా మద్దతు ధరలు: బండి సంజయ్

మహారాష్ట్రలో 4 నెలల గరిష్ఠానికి కరోనా రోజువారీ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.