MINISTER GANGULA KAMALAKAR: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని, మిల్లింగ్ పరిశ్ర మనుగడనూ పరిగణనలోకి తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఇవేమీ పట్టడం లేదని వ్యాఖ్యానించారు. మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో గంగుల సమావేశమయ్యారు.
తరుగు పేరుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం దించుకోవద్దని మిల్లర్లకు మంత్రి గంగుల తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు తరలించి మిల్లుల్లో దించుకోవాలన్నారు.మిల్లింగ్ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అందుకోసం ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు గుర్తుచేశారు.
ధాన్యం దించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని మిల్లర్లు మంత్రి గంగులకు తెలిపారు. ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాధారణ బియ్యంగా మారిస్తే ఉప్పుడు మిల్లుల పరిస్థితి సంక్షోభంలో పడుతుందన్నారు. అలాగే ధాన్యం విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పును అందరి మీద రుద్దవద్దనిరైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: KTR Interview: ప్రత్యర్థి ఎంఐఎం.. కమలం గల్లంతే: కేటీఆర్
ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. త్వరలో 'పోస్టల్ బ్యాలెట్' సౌకర్యం!