రానున్న పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీలకు, సిబ్బందికి జీతాలు పెరుగుతాయని స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.
హైదరాబాద్ కమిషనరేట్లో నిర్వహించిన అంగన్వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కమిషనర్ దివ్యతో కలిసి చీరలను పంపిణీ చేశారు.
పదోన్నతి కల్పిస్తాం..
ఈ నెలలో అంగన్వాడీ టీచర్లకు పరీక్ష నిర్వహించి.. సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సీఎం కేసీఆర్కు అంగన్వాడీ సేవలపై విశ్వాసం ఉందని.. భవిష్యత్తులో ఈ సేవలను విస్తరించే అవకాశం ఉందని వివరించారు.
'అంగన్వాడీ టీచర్లు, సిబ్బందికి బీమా కల్పించే అంశంపై సమాలోచనలు జరుపుతున్నాం. అర్హుందరికి అంగన్వాడీ సేవలు అందాలి.'
-సత్యవతి రాథోడ్ , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
ఇదీ చదవండి:రైతుల ఐకాస నుంచి బీకేయూ నేత సస్పెన్షన్