ETV Bharat / state

'ప్రైవేట్‌ ల్యాబ్‌లో పాజిటివ్‌గా తేలినా.. ఉచితంగా ఔషధ కిట్లు'

ప్రైవేట్‌ ల్యాబ్‌లలో కరోనా పాజిటివ్‌గా తేలినవారికీ హోం ఐసొలేషన్‌ ఔషధ కిట్లను ఉచితంగా అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలను పర్యవేక్షించాలని, ఆక్సిజన్‌ అవసరమైతే అందించే ప్రయత్నం చేద్దామన్నారు.

minister-etela-teleconference-with-district-medical-officers-on-corona
'ప్రైవేట్‌ ల్యాబ్‌లో పాజిటివ్‌గా తేలినా.. ఉచితంగా ఔషధ కిట్లు'
author img

By

Published : Apr 26, 2021, 10:26 AM IST

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తదితరులతో కలిసి మంత్రి ఈటల రాజేందర్... అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హోం ఐసొలేషన్‌లో ఉంటున్నవారిలో కొందరు నిర్లక్ష్యం చేయడం వల్ల శ్వాసకోశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఇంటి వద్ద ఆశా, ఆరోగ్య కార్యకర్తలు రోజుకు రెండుసార్లు రక్తంలో ఆక్సిజన్‌ శాతం, జ్వరం తదితర పరీక్షలు చేయాలని ఆదేశించారు. అప్పుడే ప్రాణాపాయ స్థితికి చేరకుండా కాపాడగలుగుతామని తెలిపారు.

పెరుగుదల తీవ్రంగా లేదు..

రక్త పరీక్షలు నిర్వహించి.. తీవ్రతను బట్టి అవసరమైతే పెద్దాసుపత్రికి తరలించాలని... లక్షణాలున్నవారు ఏ ప్రాంతం నుంచి వచ్చినా పరీక్షలు చేయాలన్నారు. టెలీ వైద్య విధానం ద్వారా అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. ఇందుకు ఐఎంఏ వైద్యుల సేవలనూ వినియోగించుకుంటామని తెలిపారు. వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేదని. త్వరలోనే వ్యాప్తి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అవసరమైతే వెంటనే నియామకాలు జరపాలన్నారు. వైద్యాధికారులకు వాహన భత్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రెమ్​డెసివిర్​పై అవగాహన కల్పించండి..

ప్రైవేటు ల్యాబ్​లలో కరోనా పాజిటివ్​ వచ్చినవారికి హోం ఐసోలేషన్ కిట్లు ఉచితంగా అందించాలని ఆదేశించారు. జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అవసరాల వివరాలను, హోం ఐసొలేషన్‌ బాధితుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నామని జిల్లా వైద్యాధికారులు మంత్రికి తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరం అందరికీ ఉండదనీ, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. కరోనా లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండానే చికిత్స మొదలుపెట్టాలని.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను ఎక్కువమందిని నియమించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: దవాఖానాల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్​ గ్రీన్​సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.