ETV Bharat / state

వైద్య ఆరోగ్య శాఖ నూతన విధానాలకు సిద్ధం కావాలి: ఈటల

author img

By

Published : Sep 21, 2020, 8:30 PM IST

వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణలకు సిద్ధం కావాలని ఆ శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాలానుగుణంగా మార్పులు చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతామన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ అయ్యాక ఆ సేవలు ప్రజలకు అందకపోతే కష్టపడి చదువుకుని ఏం లాభమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీ ఓరియంటెడ్​గా, ప్రజల పక్షంగా, అంకితభావంతో పని చేయాలని సూచించారు.

minister etela said The medical health department needs to prepare for new policies
వైద్య ఆరోగ్య శాఖ నూతన విధానాలకు సిద్ధం కావాలి: ఈటల

నూతన వైద్య విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు లాంటి జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువ వస్తున్నాయనే దానిపై మ్యాపింగ్ చేయాలని మంత్రి పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ఆయా అసుపత్రుల్లో డాక్టర్లు మందులు ఉండేలా చూడాలన్నారు.

కంపెనీలకు తిప్పి పంపాం

అన్ని చోట్ల అందుబాటులో ఎన్ని మందులు ఉన్నాయి..? అవి ఎప్పుడు గడువు తీరిపోతాయి..? అనే వివరాలు కంప్యూటరీకరణ చేయాలన్నారు. ప్రతి మందుకు కచ్ఛితంగా లెక్క ఉండాలని స్పష్టం చేశారు. వైద్య చరిత్రలో మొదటి సారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపించి డబ్బులు వెనక్కి తీసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఉన్న మంచి వైద్య విధానాలను తెలుసుకుని మన దగ్గర అమలు చేయాలని సూచించారు.

రెఫరల్ సిస్టమ్​

మంచి హెల్త్ కేర్ సిస్టమ్​లు ఏమున్నాయి..? వాటిని మన దగ్గర అమలు చేయడానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి..? వాటిని ఏవిధంగా అధిగమించాలి అనే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. మన నెట్​వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే పెద్దది. కాబట్టి రెఫరల్ సిస్టమ్​ను మొదలు పెట్టండన్నారు. ఆశా వర్కర్స్ పేషంట్లను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలన్నారు.

బంధువులకు ఎప్పటికప్పుడు

మన దగ్గర అన్ని సిస్టమ్ ఉన్నాయి వాటికి ప్రేరణ తోడవ్వాలన్నారు. పర్యవేక్షణ-జవాబుదారితనం, బాధ్యత పెరిగినప్పుడే ఫలితాలు ఉంటాయన్నారు. ఆ తరహా మార్పు రావాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో రిసెప్షన్ ఉండాలని, వారు రోగులకు అవగాహన కల్పించే విధంగా తయారవ్వాలని కోరారు. ప్రతి పేషంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి అతనికి, అతని బంధువులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.

గొప్ప మార్పులు వస్తాయి

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆసుపత్రిలో ఏం జరుగుతుందో హైదరాబాద్​ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉండి చూడగలిగే విధంగా చేయాలన్నారు. చిన్న చిన్న పథకాలు పెద్ద మార్పు తీసుకు వస్తాయన్నారు. కేసీఆర్ కిట్ పథకం వల్ల 50 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం వల్ల చిన్న వయసులో పెళ్లిళ్లు, చిన్నవయసులో గర్భాలు, నెలలు తక్కువగా పిల్లలు పుట్టడం ఆగిపోయాయన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం లేకుండా ప్రపంచంతో పోటీ పడలేమన్నారు. చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఒక సంవత్సర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు వస్తాయని మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : మంత్రి తలసానికి నిజం తెలియదు.. అందుకే ఛాలెంజ్ చేశారు: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.