సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్యారోగ్య శాఖను మంత్రి ఈటల రాజేందర్ అప్రమత్తం చేశారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఈటల వెల్లడించారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతామని ప్రకటించారు. గాంధీ, టిమ్స్, నిమ్స్‌లో మళ్లీ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేవని వెల్లడించారు. ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. కరోనా ఉన్నంత కాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్రం.. వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలని కోరారు. వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తే ఏర్పాట్లకు సిద్ధం చేస్తామని తెలిపారు.
ఇప్పటివరకు 11 లక్షలకు పైగా డోసులు వచ్చాయని చెప్పారు. 50 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని వెల్లడించారు. నాణ్యమైన మందుల కోసం బడ్జెట్‌లో నిధులు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : జీవశాస్త్రాల పురోగతికి ఔషధం