రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ బారిన పడి వందల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతుండగా, వేల మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా హైకోర్టు ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ వైద్యాధికారులతో సమీక్ష చేపట్టారు.
పరీక్షల విషయంలో నిర్లక్ష్యం వద్దు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్య శ్రీ ట్రస్టు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డెంగ్యూ, ఇతర విషజ్వరాల ప్రభావం, అందుబాటులో ఉన్న మందులు, తక్షణం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రోగులకు తప్పకుండా టెస్ట్‌లు చేయాలని సూచించామని మంత్రి తెలిపారు. వ్యాధి నిర్ధరణ తేలితే సరియైన వైద్యం సకాలంలో అందించవచ్చని చెప్పారు.
మందుల లోటు లేకుండా చూసుకోండి
పీహెచ్‌సీ నుంచి ఉన్నత స్థాయి ఆస్పత్రుల వరకు అన్నింటిలో మందులతో పాటు... అవసరమైన చోట ఎక్కువ మంది వైద్యులను అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ మానిక్ రాజ్ ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:దత్తాత్రేయను కలిసిన తెరాస ఎంపీ డీఎస్