ETV Bharat / state

కొవిడ్​ టెస్ట్​ ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్​ - కరోనా టెస్ట్​ ల్యాబ్​ ప్రారంభం వార్తలు శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​

అంతర్జాతీయ, డొమెస్టిక్​ విమానాల్లో ప్రయాణించే వారికోసం శంషాబాద్​ ఎయిర్​పోర్టులో కొవిడ్​ టెస్టింగ్​ ల్యాబ్​ను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. కరోనా నిబంధనల్లో భాగంగా 96 గంటలలోపు నెగిటివ్​ వచ్చిన తర్వాత ఆర్​ టీపీసీఆర్​ రిపోర్టు ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయాణాలు చేసేందుకు అనుమతులు ఉన్నాయి. నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధిలో రిపోర్టులు ఇచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.

కొవిడ్​ టెస్ట్​ ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్​

author img

By

Published : Nov 4, 2020, 10:12 PM IST

అంతర్జాతీయ, డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్​ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల ప్రారంభించారు. కరోనా నిబంధనల్లో భాగంగా 96 గంటలలోపు నెగిటివ్ వచ్చిన ఆర్​టీపీసీఆర్ రిపోర్టు ఉన్నప్పుడు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేందుకు అనుమతులు ఉన్నాయి.

అలా రిపోర్టు లేకుండా ఇతర దేశాలు లేక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో వారం రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు సైతం రిపోర్టు తప్పనిసరిగా ఎయిర్ పోర్టులో చూపాల్సి ఉన్నందున మ్యాప్ మై జీనోమ్ సంస్థతో కలిసి జీఎంఆర్ ప్రతినిధులు ఈ ల్యాబ్​ని ఏర్పాటు చేశారు. దీంతో విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్​లోనే తమ టెస్టులు చేయించుకోవచ్చు.

నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధిలో రిపోర్టులు ఇచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఫలితాలను మెయిల్​కి పంపటంతోపాటు.. అవసరమైన వారికి హార్డ్ కాపీని ఇవ్వనుంది. సరైన సమయానికి రిపోర్టులు అందకపోయినా లేక 96 గంటలు దాటిన తర్వాత విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు కూడా ఎయిర్ పోర్టులో టెస్టులు చేయించుకుని నెగిటివ్ వస్తే క్వారంటైన్ లేకుండా ఇంటికి వెళ్లేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది.

ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.