స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకి నిధులు రావడంలేదని వివరించారు.
ఆర్థిక సంఘాలు గ్రామ పంచాయితీలకు కేటాయించడం వల్ల ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గ్రాంటులు రావడం లేదని మంత్రి తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.