ETV Bharat / state

'గ్రామ పంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది' - హైదరాబాద్ వార్తలు

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు.

Minister Errabelli Dayakar Rao, National Panchayati Raj Day

author img

By

Published : Apr 24, 2021, 8:06 AM IST

సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని ప్రవేశపెట్టిన తరువాతే గ్రామ పంచాయతీల రూపురేఖలు మారాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, సిబ్బందికి ఆయన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. అనేక సంస్కరణలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు మొదలయ్యాయన్నారు. కల్లాలు, రైతు వేదికలు వచ్చాయని తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా రు.308 కోట్ల నిధులను పంచాయతీలకు అందజేస్తున్నామని... కొత్తగా 3,146 తండాలు పంచాయతీలు అయ్యాయని స్పష్టం చేశారు.

పల్లె ప్రగతి ద్వారా స్వచ్ఛ సర్వేక్షన్​లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. మన స్థానిక సంస్థలకు దేశంలోనే ఉత్తమమైన 12 అవార్డులు వచ్చాయని స్పష్టం చేశారు. అవార్డులను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ అందచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్, కమిషనర్ రఘునందన్ రావు, పలువురు అధికారులు పాల్గొంటారని తెలిపారు.

ఇదీ చూడండి: 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్వీ రమణ.. నేడు పదవీ ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.