ETV Bharat / state

ERRABELLI DAYAKAR RAO: స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు రూ. 3వేల కోట్ల రుణాలు

స్త్రీ నిధికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. మహిళా సంఘాలను ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని చెప్పారు. స్త్రీ నిధి బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు 632 కంప్యూటర్లు, ప్రింటర్లను మంత్రి ఎర్రబెల్లి అందించారు.

minister errabelli dayakar rao
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, స్త్రీ నిధి
author img

By

Published : Aug 23, 2021, 6:26 PM IST

స్త్రీ నిధి బ్యాంకు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళాసంఘాలకు రూ. 3 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రూ. 2వేల 340 కోట్లు, పట్టణాలకు రూ. 720 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. మండల, పట్టణ సమాఖ్యలు, నైబర్ హుడ్ సెంటర్లకు.... స్త్రీనిధి బ్యాంకు ద్వారా 632 కంప్యూటర్లు, ప్రింటర్లను మంత్రి హైదరాబాద్​లో అందించారు.

స్త్రీ నిధికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు: మంత్రి ఎర్రబెల్లి

స్త్రీ నిధికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. మహిళా సంఘాలను అభివృద్ధి దిశగా తీసుకుపోయే ఆలోచనలో సీఎం కేసీఆర్​ ఉన్నారు. మహిళా సంఘాల ద్వారా ఏ వస్తువు కొన్నా నాణ్యతతో ఉంటుందని ప్రజల్లో నమ్మకం కలిగింది. వీటి ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి. -ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ద్వారా లక్ష పాడి పశువుల కొనుగోళ్లకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. శ్రీనిధి విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూరు మహిళా సహకార డైరీ, నార్ముల్ డైరీల సహకారంతో.. సుమారు మూడు వేల గ్రామాల రైతులతో సమన్వయం చేసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక ఏడాదిలో మహిళా స్వయం సహాయక సంఘాలకు.. సెర్ప్ ద్వారా రూ. 10వేల 448 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించినట్లు... పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.

ఇదీ చదవండి: tarun chugh: రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.