ETV Bharat / state

'కరోనా వైరస్​ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే లక్ష్యం'

గతానికి భిన్నంగా ఈ సారి ఇంట్లో ఒక్కరికి వస్తే మిగతా అందరికీ వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. అన్ని జిల్లాల వైద్య అధికారులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా వైరస్​ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే మనందరి లక్ష్యమని అధికారులకు సూచించారు.

minister eetela rajendar
'కరోనా వైరస్​ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే లక్ష్యం'
author img

By

Published : Apr 25, 2021, 8:17 PM IST

కరోనా వైరస్​ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే మనందరి లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. అన్ని జిల్లాల వైద్య అధికారులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. గతానికి భిన్నంగా ఈ సారి ఇంట్లో ఒక్కరికి వస్తే మిగతా అందరికీ వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని మంత్రి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు ఎక్కువ మంది హోం ఐసోలేషన్​లో ఉంటున్నారన్న మంత్రి... వీరు ఇంట్లో నిర్లక్షం చేయడం వల్ల తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కరోనా వచ్చి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశావర్కర్లు రోజుకు రెండు సార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్ష చేయాలన్నారు. అలా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని మంత్రి వెల్లడించారు.

టెస్టింగ్ కిట్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాశామని మంత్రి ఈటల తెలిపారు. గత వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేదన్న మంత్రి... వ్యాప్తి తగ్గుతోందని ఆశిస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధరణ పరీక్షలతో సంబంధం లేకుండానే చికిత్స మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అర్బన్ పీహెచ్​సీ, బస్తీ దవాఖానాలు, జీహెచ్​ఎంసీ ఏరియాల్లో ఏఎన్​ఎంలు , ఆశావర్కర్లను ఎక్కువ మందిని నియమించాలని ఆదేశించారు.

ప్రైవేట్​లో పరీక్షలు చేసుకుని పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలు కూడా వైద్య ఆరోగ్య శాఖకి అందాలని అన్నారు. వారికి కూడా హోమ్ ఐసోలేషన్​ కిట్స్ అందించాలన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏఎంఏ సేవలు కూడా వినియోగించుకుంటామని మంత్రి ఈటల చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు ఇస్తున్న చికిత్సను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్ అవసరం అయితే అందించే ప్రయత్నం చేయాలని మంత్రి ఈటల రాజేందర్​ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: టీకా కోసం వారికి​ రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.