వైద్య కళాశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎయిమ్స్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఎలాటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హైదరాబాద్లోని కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమయ్యారు.
పరికరాలను సమకూర్చుకునేందుకు విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులు, పారా మెడికల్ విద్యార్థుల సేవలు ఉపయోగించుకుంటామని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు మనమంతా సమాయత్తం కావాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి:లాక్‌డౌన్ ఉల్లంఘన.. యథేచ్ఛగా మద్యం అమ్మకం