రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని సనత్‌నగర్‌లోని బాప్టిస్ట్ చర్చిలో మంత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండగ ఇచ్చే స్ఫూర్తితో ప్రజలు కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈస్టర్ ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.