రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వాసుపత్రుల వైద్యులు, సూపరింటెండెంట్లతో సమీక్షించారు. వైరస్ కంటే భయమే ప్రమాదమైనదని మంత్రి పేర్కొన్నారు. బాధితుల్లో ధైర్యం నింపాలని మంత్రి ఈటల వైద్యులకు సూచించారు. కరోనాకు రాష్ట్రమంతటా ఒకే వైద్యం అందించాలని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు విజయ్ ఎల్దండి, హైదరాబాద్కి చెందింది డాక్టర్ ఎంవీ రావు, డాక్టర్ సునీత, చెస్ట్ ఆస్పత్రి సుపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్, డాక్టర్ శంకర్, డాక్టర్ గంగాదర్ పలు సూచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను రాష్ట్రంలోకి అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటల ప్రకటించారు. యాంటీ వైరల్ మందులకంటే కరోనాకు స్టెరాయిడ్లు బాగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..