కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా మూడో దశకు చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు... వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా పూర్తిస్థాయిలో పరిశీలనలో ఉంచాలని మంత్రి ఈటల వైద్యులకు సూచించారు. వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. కావాల్సిన పరికరాలు అన్నీ సమీకరించుకోవాలన్నారు.
కరోనా సోకిన వారిలో ఇద్దరు ప్రైవేటు వైద్యులు ఉన్నారని మంత్రి తెలిపారు. పీహెచ్‌సీల్లో పనిచేసేవారు, ఆశా వర్కర్లు ఎక్కడి వారు అక్కడే ఉండాలని పేర్కొన్నారు. సిబ్బందికి భోజనం, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.