INISTER DHARMANA ON CAPITAL: విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని, లేని పక్షంలో కొత్త రాష్ట్రంగానైనా ప్రకటించాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక, విభజనతో విడిచిపెట్టి వచ్చామని.. ఇదే పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ నుంచి బొంతలకోడూరు వరకు రూ.4.98 కోట్లతో నిర్మించిన బీటీరోడ్డును మంత్రి ధర్మాన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించి ‘బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి రియల్‌ఎస్టేట్ వ్యాపారుల నగరమని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం చంపాగల్లీ వీధిలో శుక్రవారం నిర్వహించిన ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మీ సమస్యలు తెలుసుకునేందుకు గడపగడపకూ వస్తున్నామన్నారు. ఇందాక ఓ బామ్మను సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారు అంటే మా వాలంటీరు ఇస్తున్నాడని అంటోందని ఓ అబ్బాయి చెబుతున్నాడని.. ఇస్తున్నది వాలంటీరే గానీ, ఇవ్వమని చెప్పిందెవరు.. జగన్‌మోహన్ రెడ్డి, వైకాపా ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: