ఏపీలోని విశాఖ జిల్లా ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్ చెక్కిన కళాఖండం పలువురిని ఆకట్టుకుంటోంది. ఉగాది పండుగను పురస్కరించుకొని.. సబ్బుపై మామిడికాయలు, కొమ్మలు, పూర్ణకుంభాన్ని చక్కగా చెక్కాడు. కింద భాగంలో ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగులో చెక్కిన కళాకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
పండగలు, స్వాతంత్ర సమరయోధుల జయంతి, వర్ధంతి.. ఇలా వివిధ సందర్భాలలో.. సూక్ష్మ కళాఖండాలను సబ్బులు, శుద్ధముక్కలపై తయారుచేసి మన్ననలు పొందుతున్నాడు గోపాల్.
ఇదీ చదవండి: ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్