రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
కంచన్ బాగ్లోని ఓవైసీ ఆస్పత్రిలో ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా త్వరగా తీసుకోవాలని.. కరోనా నుంచి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన పలువురు నాయకులు