ETV Bharat / state

ఆ విషయాలపై సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేఖ - Akbaruddin letter to CM on aasara pensions

MLA Akbaruddin Letter To CM KCR: మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజామ్‌లకు 5 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను ప్రభుత్వం చెల్లించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. అదే విధంగా 2 నెలలుగా బకాయి పడిన ఆసరా పింఛన్లు చెల్లించాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు.

Akbaruddin Letter To CM KCR
Akbaruddin Letter To CM KCR
author img

By

Published : Nov 12, 2022, 9:30 PM IST

MLA Akbaruddin Letter To CM KCR: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజామ్​లకు గత 5 నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కేసీఆర్​ను కోరారు. అర్హులైన వాళ్లందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని తెలిపారు. ఈ మేరకు అక్బరుద్దీన్ సీఎంకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. రాష్ట్రంలో పది వేల మంది ఇమామ్​లు, మౌజామ్​లు మసీదుల్లో పనిచేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనమే వాళ్లకు ఆధారమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గత జులైలో బడ్జెట్ కేటాయించడంతో వక్ఫ్ బోర్డు అధికారులు చెక్కులు పంపించినా.. ఆర్థికశాఖ నుంచి మాత్రం అనుమతి రావడం లేదని అక్బరుద్దీన్ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు సైతం సకాలంలో అందక.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 57 ఏళ్ల వయసు దాటిన అర్హులు వృద్ధాప్య పింఛన్​కు దరఖాస్తు చేసున్నారని చెప్పారు. కానీ వారికి గుర్తింపు పత్రాలు ఇచ్చినప్పటికీ.. పింఛన్ మాత్రం ఇవ్వడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అర్హులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అక్బరుద్దీన్ కోరారు.

ఇవీ చదవండి: మూడు నెలలుగా అందని ఆసరా పింఛన్లు.. ఇబ్బందులుపడుతున్న లబ్ధిదారులు

రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.