ETV Bharat / state

'పాతబస్తీలో పారిశుద్ధ్యం, పైవంతెనలు, కాలిబాటలు లేవు' - పాతబస్తీలో అనేక పారిశుద్ధ్య సమస్యలు

శాసనసభ సమావేశాల సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాతబస్తీలో సమస్యలపై మండిపడ్డారు. పాతబస్తీలో అనేక పారిశుద్ధ సమస్యలు ఉన్నాయన్నారు. పాతబస్తీలో రహదారుల వెడల్పు పనులు, ఆక్రమణలు ఎప్పుడు తొలగిస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. పైవంతెనలు, కాలిబాటలు, బస్‌ బేలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

MIM MLA Akbaruddin Owaisi said patabasti has no sanitation no bridges no sidewalks
'పాతబస్తీలో పారిశుద్ధ్యం, పైవంతెనలు, కాలిబాటలు లేవు'
author img

By

Published : Sep 16, 2020, 2:23 PM IST

'పాతబస్తీలో పారిశుద్ధ్యం, పైవంతెనలు, కాలిబాటలు లేవు'

"పాతబస్తీలో పైవంతెనలు, కాలిబాటలు, బస్‌ బేలు లేవు. పాతబస్తీలో అనేక విద్యాసంస్థలున్నా మౌలిక సౌకర్యాలు లేవు. అక్కడ చదివే విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముషీరాబాద్‌, బోరబండ, హఫీజ్‌పేట, ఎర్రగడ్డలో ఎస్‌టీపీ ప్లాంటులు లేవు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వైద్యసేవలు మెరుగుపరచాలి. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో యాచకుల సమస్య పరిష్కరించాలి. ఇందిరాపార్కు వద్ద ఎటుచూసినా యాచకులే కనిపిస్తున్నారు.

పాతబస్తీలో అనేక పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి. పాతబస్తీలో రహదారుల వెడల్పు పనులు చేపట్టాలి. ఆక్రమణలు ఎప్పుడు తొలగిస్తారో చెప్పాలి. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఎంఐఎం ఎంతో పోరాడింది. ఇన్ని వర్షాలు కురిసినా గండిపేట, హిమాయత్‌సాగర్‌లో నీళ్లు లేవు. గండిపేట, హిమాయత్‌సాగర్‌కు నీళ్లు వచ్చే కాల్వలు మూసేశారు. మూసీ నది పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. వెంటనే మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆటస్థలాలన్నీ మూలన పడ్డాయి. జీహెచ్‌ఎంసీలో ఆటస్థలాల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.

చార్మినార్‌, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్‌ ప్రముఖ పర్యాటక కేంద్రాలు. చార్మినార్‌ పర్యాటక కేంద్రమే కాదు.. ప్రముఖ వ్యాపార కేంద్రం కూడా. పర్యాటక ప్రాంతాల వద్ద మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలి. లాడ్ బజార్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. ఎన్ని ఏళ్లు గడిచినా పాతబస్తీ రూపురేఖలు మారడం లేదు. ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వంతెన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మెట్రో రైలు పాతబస్తీకి ఎప్పుడు వస్తుందో స్పష్టంగా చెప్పాలి. హైదరాబాద్ మెట్రో కోసం జనార్దన్​రెడ్డితో కలిసి పోరాడాం. హైదరాబాద్‌కు కృష్ణా జలాల కోసం జనార్దన్​రెడ్డితో కలిసి పోరాడాం."

- ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

ఇదీ చూడండి : శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.