ETV Bharat / state

Helicopter Crash: ఎంఐ17వి5 హెలికాఫ్టర్‌ ఎన్నడూ కూలిన దాఖలాలు లేవు: రిటైర్డ్ మేజర్​ శివకిరణ్‌ - telangana varthalu

సైనిక హెలికాఫ్టర్‌ కూలిన ఘటన దురదృష్టకరమని విశ్రాంత సైనిక అధికారి మేజర్‌ శివకిరణ్‌ తెలిపారు. ఎంఐ17 వి5 హెలికాఫ్టర్‌ గతంలో ఎన్నడూ కూలిన దాఖలాలు లేవని, ఈ హెలికాఫ్టర్‌లో 18 మంది వరకు ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా? అనే విషయం విచారణలో తేలుతుందని చెబుతున్న విశ్రాంత సైనిక అధికారి శివకిరణ్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Helicopter Crash: ఎంఐ17 వి5 హెలికాఫ్టర్‌ ఎన్నడూ కూలిన దాఖలాలు లేవు: మేజర్​ శివకిరణ్‌

author img

By

Published : Dec 8, 2021, 6:48 PM IST

Updated : Dec 8, 2021, 7:29 PM IST

ఎంఐ17 వి5 హెలికాఫ్టర్‌ ఎన్నడూ కూలిన దాఖలాలు లేవు: మేజర్​ శివకిరణ్‌
  • భారత వైమానిక దళానికి చెందిన ఈ హెలికాప్టర్​ ఎలాంటి పరిస్థితుల్లో పయనిస్తుంది?

ఇవాళ జరిగిన ఘటన చాలా దురుదృష్టకరం. ఈ ఎంఐ17 అనే హెలికాప్టర్​ను సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడానికి వాడుతారు. చాలా వరకు భూభాగం సరిగా లేనపుడు, రోడ్డు సరిగా లేనపుడు దీనిని వాడుతారు. అదికాకుండా యుద్ధం జరిగినపుడు సైనికులను, గాయపడ్డ వారిని తరలించడానికి వాడుతారు. సీనియర్​ అధికారులను తరలించడానికి కూడా వినియోగిస్తారు. ఇవాళ జరిగిన ఘటన అయితే సీడీఎస్​ బిపిన్​ రావత్​ కోయంబత్తూరు నుంచి స్టాఫ్​ కాలేజీలో లెక్చర్​ ఇవ్వడానికి వస్తున్నారు. సరిగ్గా స్టాఫ్​ కాలేజీ చేరే ముందు క్రాష్​ కావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. రవాణా కోసమే ఈ హెలికాప్టర్​ వాడడం జరుగుతుంది.

  • ఈ హెలికాప్టర్​ సామర్థ్యం ఎంత? ఎంత మంది ప్రయాణించొచ్చు?. అదే విధంగా ప్రతికూల పరిస్థితుల్లో గాల్లోకి ఎగురుతుందా?

రిపోర్ట్స్​ ప్రకారం ఈ హెలికాప్టర్​లో 18 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఇది రష్యాలో తయారైన హెలికాప్టర్​. మన దగ్గరికి నాలుగైదు సంవత్సరాల క్రితం కొత్త వర్షన్స్​ వచ్చాయి. దీనికి ముందు ఈ హెలికాప్టర్​ కూలిన దాఖలాలు కూడా లేవు. చాలా సురక్షితమైన హెలికాప్టర్​. ఈ హెలికాప్టర్​ ఎగిరే ముందే అన్ని అంశాలను పరీక్షిస్తారు. ఇలాంటి ప్రమాదాలు మూడు కారణాల వల్ల జరుగుతాయి. అవి ఏంటంటే మానవ తప్పిదం అనగా పైలెట్​ తప్పు వల్ల కావచ్చు. సాంకేతిక లోపం వల్ల కావచ్చు. వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో విచారణలో తెలుస్తుంది. బిపిన్​ రావత్​ ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

  • ప్రధానంగా ఈ హెలికాప్టర్​ను ఎటువంటి సమయాల్లో ఉపయోగిస్తారు?

సాధారణంగా రవాణా కోసం వినియోగిస్తాం. రెండు ప్రాంతాల మధ్య రోడ్డు సరిగా లేనప్పుడు దీనిని వాడడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు సరిగా ఉంటే రవాణా సులువుగా ఉంటుంది. బిపిన్​ రావత్​ డిఫెన్స్​ స్టాఫ్​ కాలేజీలో లెక్చర్​ ఇవ్వడానికి కోయంబత్తూరు నుంచి వెల్లింగ్​టన్​కు త్వరగా రావడానికి ఈ హెలికాప్టర్​లో వచ్చారు. కానీ ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.

  • మొత్తంగా ఈ ప్రమాదం మీద మీరేమంటారు?

ఒక్కసారి సర్వీసెస్​లో జీవితం అనేది రిస్క్​లో ఉన్నట్లే. కానీ సీడీఎస్​ లాంటి స్థానంలో ఉన్నపుడు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని అంశాలను సరిగా చూసుకున్నారా అనేది విచారణలో తెలిసే విషయం. ఈ హెలికాప్టర్​లో ప్రయాణించిన వారిలో ముగ్గురు సీనియర్​ అధికారులు ఉన్నారు. సీడీఎస్​ బిపిన్​ రావత్​తో పాటు బ్రిగేడియర్​, లెఫ్టినెంట్​ కల్నల్​ ఉన్నారు. వారితో పాటు ఇద్దరు లాన్స్​ నాయక్​లు, ఒక నాయక్​, ఒక హవల్దార్​ ఉన్నారు. సాధారణంగా భద్రతా కారణాలతో సీనియర్​ అధికారులు ఒకేసారి కలిసి వెళ్లరు. ఈ ప్రమాదంలో ముగ్గురు కలిసే వెళ్లారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 8, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.