లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలో సికింద్రాబాద్లోని ఆలుగడ్డబావి వద్ద నివసిస్తున్న 100కుపైగా వలస కార్మికుల కుటుంబాలను జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు ఖాళీ చేయించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ తల దాచుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లోని పునరావాస కేంద్రానికి తరలించారు.
వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా వారంతా ఒకే చోట సమూహంగా ఉండటం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వారిని తరలించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 100 మందికి పైగా వలస కార్మికులు ఆర్టీసీ బస్సులో పునరావాస కేంద్రానికి తరలించారు. దీనితో ఆర్టీసీ బస్సు కార్మికులతో కిక్కిరిసింది. వారందరికీ ఉచిత భోజన సదుపాయాలన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు