Migrant Voters In Telangana : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు కోసం ప్రధాన పార్టీలైన.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పలువ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపోటముల్లో ప్రాధాన పాత్ర వహించే వలస ఓటర్ల సమాచార సేకరణకు పార్టీలన్ని కసరత్తులు చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే సూమారు 2లక్షలకు పైగా ఓటర్లు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. అత్యధికంగా మునుగోడులోనే నలభై వేలకుపైగా ఓటర్లుంటారని ప్రధాన పార్టీలు గతంలోనే లెక్కతేల్చాయి.
17% అభ్యర్థులు నేరచరితులే: ఏడీఆర్ నివేదిక
వీరంతా హైదరాబాద, భీవండి, ముంబయి, సూరత్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వెళ్లినవారే. మునుగోడు తర్వాత అధికంగా వలస ఓటర్లు ఉన్న నియోజకవర్గం దేవరకొండ. ఇక్కడ సుమారు 25వేల వరకు వలస ఓటర్లుంటారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. వీరంతా.. హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనిగిరి, ఆలేరుల్లో సుమారు 20వేల వరకు ఓటర్లుంటారని అంచనా.
TS Political Leaders Concentrated on Migrant Voters : తుంగతుర్తి, సాగర్, సూర్యపేటల్లో సుమారు పది వేలకు మించి వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీల నాయకులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పటి నుంచే వీరితో టచ్లో ఉంటూ.. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందుగానే స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు, గతంలో పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వారిని ప్రచారానికి సైతం రావాలని ఓటర్లను ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వలస ఓటర్లు చిరునామాల వివరాల సేకరణకు ఓ ప్రధాన పార్టీ ప్రత్యేక బృందాలనే నియమించింది. ప్రతి గ్రామంలో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు బృందంగా ఏర్పడి ఆ గ్రామంలో ప్రతి వలస ఓటరు అడ్రెస్, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ను తయారు చేస్తున్నారు. వారికి రెండు నెలలపాటు నెలవారిగా జీతం ఇచ్చేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ఓ మండలంలోని ఆయా గ్రామాల్లోని ఓటర్ల చిరునామ సేకరణ చేసే బాధ్యతను రూ.5లక్షల ప్యాకేజీకో ఓ బృంకానికి.. ఓ ప్రధాన పార్టీ నేత అప్పగించినట్లు సమాచారం.
Special Reports on Migrant Workers in Telangana : కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డ వలస ఓటర్లను స్వస్థలాలకు ఎన్నికల సమయంలో తీసుకురావడానికి సైతం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ టికెట్ తనదేనని గట్టిగా నమ్ముతున్న ఓ నేత సైతం వలస ఓటర్ల జాబితా తయారు చేసే బాధ్యతను ఎన్నికల బృందానికి అప్పగించారు.
Prathidhwani : అభ్యర్థులు.. అఫిడవిట్లు.. పూర్తి వివరాలు వెల్లడి చేయకపోతే.. పరిణామాలేంటి..?
వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి వారి సామాజికవర్గానికి చెందిన సంఘాలతో ప్రధాన పార్టీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. నోటిఫికేషన్ విడుదలైతే ప్రచారంలో తీరిక లేకుండా ఉంటామని.. అందుకే వారి గురించి ఇప్పటి నుంచే వారితో మంతనాలు సాగించి అనుకున్న సమయానికి వారు ఇక్కడకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఈటీవీ భారత్కు వెల్లడించడం గమనార్హం. గతేడాది జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో వలస ఓటర్లను ఆకర్షించిన ఓ ప్రధాన పార్టీ తమ గెలుపునకు కారణమనుకొని.. అదే వ్యూహాలను అమలు చేస్తోంది.
MLC candidates Assets: ఎమ్మెల్సీ బరిలో 'కోటీశ్వరులు'... ఆస్తుల వివరాలివే!
ప్రస్తుతం జాబితా తయారిలో నిమగ్నమైన బృందాలు త్వరలోనే పూర్తి నివేదిక ఎమ్మెల్యే అభ్యర్థులకు అందజేయనుందని సమాచారం. నివేదిక ప్రకారం సామాజికవర్గాల వారీగా ఎంతమంది ఓటర్లున్నారో తెలుసుకొని వారందరూ తమకు మద్దతిచ్చేలా ఆయా వర్గాల నాయకులతో చర్చలు జరపి.. ప్రచారానికి ఉపయోగపడే విధంగా చేసే ఆలోచనున్నట్లు తెలిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు తేలిన తర్వాతే తాము ఏ పార్టీకి మద్దతిస్తామనేది చెబుతామని కొన్ని చోట్ల వలస ఓటర్ల సంఘాల నాయకులు ప్రాథమిక చర్చలు జరిపిన నాయకులతో చెప్పినట్లు సమాచారం.