ETV Bharat / state

అప్పులు చేసి పెడితే.. తిప్పలు పెడతారా? - వంటకార్మికులకు చెల్లించాల్సిన బిల్లులు

కరోనా కాలంలో అప్పులు పుట్టడమే గగనం.. ఈ పరిస్థితుల్లో వ్యాపారులను బతిమిలాడుకొని సరకులు తెచ్చారు.. తెలిసిన వారి వద్ద ఉద్దెరకు డబ్బులు తెచ్చి విద్యార్థులకు రెండు నెలలపాటు మధ్యాహ్నం భోజనం వండి పెట్టారు. అలాంటి వంట కార్మికులకు మూడు నెలలు గడుస్తున్నా పాఠశాల విద్యాశాఖ బిల్లులు మంజూరు చేయలేదు.

bills-not-sanction-for-cooking-workers-on-midday-meals
అప్పులు చేసి పెడితే.. తిప్పలు పెడతారా?
author img

By

Published : May 17, 2021, 7:11 AM IST

అసలే కరోనా కాలం. ఈ సమయంలో అప్పు పుట్టాలంటే చాలా కష్టపడాలి. అయినా అప్పచేసి, సరుకులు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టారు వంట కార్మికులు. వారికి విద్యాశాఖ అధికారులు బిల్లులు మంజూరు చేయకపోగా.. చివరకు నెలకు రూ.వెయ్యి చొప్పున రావాల్సిన గౌరవ వేతనమూ ఇవ్వలేదు. ఇప్పుడు అప్పుపై సరకులు ఇచ్చిన వ్యాపారులు డబ్బు కోసం ఒత్తిడి చేస్తుండడంతో విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి వారిది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వేల పాఠశాలల్లోని చిన్నారులకు మొత్తం 30 వేల మంది మహిళలు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. దీనికోసం ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఇస్తోంది. వంట ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.7.45 చొప్పున చెల్లిస్తుంది. కావాల్సిన సరుకులను వంట కార్మికులే సమకూర్చుకోవాలి. ఈ పని చేస్తున్నవారిలో వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ మహిళలే. వీరికి గౌరవ వేతనం కింద నెలకు ఒక్కో కార్మికురాలికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి. గత ఏడాది రాష్ట్రంలో బడులు తెరవకపోవడంతో దాదాపు ఏడాదిపాటు వీరు దొరికిన పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతులకు, 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఆ సమయంలో మధ్యాహ్న భోజనం కోసం వంట కార్మికులను ప్రధానోపాధ్యాయులు పిలిస్తే తమ వల్ల కాదని, అప్పులు చేసి భోజనం పెడితే బిల్లులు రావంటూ వంట మహిళలు వెనకడుగు వేశారు.

ప్రధానోపాధ్యాయులు బతిమాలడంతో అంగీకరించారు. ప్రభుత్వం మాత్రం వారి సేవలకు విలువనివ్వలేదు. వారికి బిల్లులను చెల్లించలేదు. ఈ రూపేణా దాదాపు రూ.12 కోట్ల వరకు వీరికి రావాల్సి ఉంది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు భోజనంలో గుడ్లు సమకూర్చినందుకు రూ.10 కోట్లు కూడా చెల్లించాలి. పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది మాదిరిగా తామూ ఉపాధి కోల్పోయామని, వారి మాదిరిగానే తమకూ ఆపత్కాల సాయం అందించాలని వేడుకుంటున్నా వినేవారు లేకుండా పోయారని వంట ఏజెన్సీల మహిళలు వాపోతున్నారు.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వలస కార్మికులు పయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.