రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారం తగ్గించి... భూ సేకరణ చట్టాలను ఉల్లఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు.
తమకు కేటాయించిన స్థలాలు నివాస యోగ్యంగా లేవని... అందులో బండరాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని వాపోయారు. తమకు రావాల్సిన పరిహారం ఇప్పించి... చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని నిర్వాసితులు కమిషన్ను కోరారు. ఈ ఘటనపై స్పందించిన హెచ్ఆర్సీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
- ఇదీ చూడండి బాలు మృతిపట్ల కేటీఆర్, హరీశ్ రావు విచారం