Microsoft Idc Turns 25 years : కంప్యూటర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఎందుకంటే ఇండియాలో వాడే దాదాపు 90 శాతం కంప్యూటర్లు ఆ సంస్థ తయారు చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే పనిచేస్తాయి. భారత దేశంలో 1998లో ఆ సంస్థ తొలిసారిగా డెవలప్ మెంట్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి నేటికి 25 ఏళ్లు. పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని నేడు అందరూ గుర్తించదగిన వృద్ధి సాధించామని ఆ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి.
Meta Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్‌కు పోటీగా ఫేస్బుక్ AI.. ఫ్రీ యాక్సెస్!
Microsoft Idc Turns 25 years celebrations : పాతికేళ్ల కిందట సాఫ్ట్వేర్ రంగం అంటే అందరూ బెంగళూరు, పుణే అనుకునేవారు. అప్పుడప్పుడే హైదరాబాద్‌లో సత్యం, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విస్తరిస్తున్నాయి. ప్రపంచ అగ్రగామి సాఫ్ట్వేర్ మైక్రో సాఫ్ట్ తొలిసారి తమ డెవలప్ మెంట్ కేంద్రాన్ని 1998లో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఆ తర్వాత పుణే, బెంగళూరు నగరాల్లో శాఖలు నెలకొల్పింది. ఆ తర్వాత ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలను చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగింది.
Microsoft IDC Hyderabad completes 25 years : దీనిని ప్రేరణగా తీసుకుని ఎన్నో దిగ్గజ సంస్థలు హైదరాబాద్ వేదికగా తమ సేవలను అందించడానికి ముందుకు వచ్చాయి. ఐటీలో ప్రయోగాలు చేస్తూ మొదటిసారిగా తమ ప్రొడక్ట్ డిజైనర్స్ ను పెట్టుకుని ప్రొడక్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ ఎవరంటే మైక్రోసాఫ్ట్ అనేలా ఈ కంపెనీ ప్రయాణం సాగింది. ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన సంస్థ ప్రయాణం పది వేలకు పైగా ఉద్యోగులతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక్కడ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించి పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఉద్యోగులంతా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
దిగ్గజ సంస్థల్లో నియామకాల జోరు.. H1B ఉద్యోగుల కోసం వేట.. వారికే ప్రాధాన్యం!
అప్పట్లో ఎన్నో సందేహాలతో తాము భారత్ లో అడుగుపెట్టామని ఈ రోజు ఈ కేంద్రం ప్రపంచంలోని ప్రాధాన్య కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టించబోతోందని రైతుల నుంచి రక్షణ రంగం వరకు అన్ని రంగాల్లో అందరి ఆకాంక్షలను అది సాకారం చేస్తుందని ఆయన అన్నారు. 25 ఏళ్ల వేడుకల సందర్భంగా ఉద్యోగులు అంతా సందడి చేశారు. ఆటా పాటలతో నృత్యాలు చేశారు.
మైక్రోసాఫ్ట్‌లోకి శామ్ ఆల్ట్‌మన్- ధ్రువీకరించిన సత్య నాదెళ్ల, తమ లక్ష్యం కొనసాగుతుందంటూ ట్వీట్