ETV Bharat / state

Mewat Gang Arrest : విమానాల్లో వస్తారు.. సూటూబూటు వేసుకుని ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొడతారు!

Mewat Gang Arrest : తెలంగాణ సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏటీఎం యంత్రాల నుంచి రూ.కోట్ల డబ్బు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా జైపూర్ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లే విమానంలో నిందితులు వస్తున్నారన్న పక్కా సమాచారంతో అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విమానాశ్రాయంలోనే ఏడుగురినీ అరెస్టు చేశారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ATM Fraud Gang Arrest
Mewar ATM Fraud Gang Arrest in Rajasthan
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 9:16 AM IST

Mewat Gang Arrest విమానాల్లో వస్తారు సూటూబూటు వేసుకుని ఏటీఎంల నుంచి డబ్బులు కొల్లగొడతారు

Mewat Gang Arrest : తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎం(ATM)లోని డబ్బు కాజేస్తున్న ముఠా రాజస్థాన్ పోలీసులకు రెండు రోజుల క్రితం చిక్కింది. ఆరేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా హైదరాబాద్ నుంచి విమానంలో రాజస్థాన్ వస్తోందనే సమాచారం అందుకున్న అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జైపూర్ విమానాశ్రయంలో కాపు కాసి.. వారిని పట్టుకున్నారు. దర్యాప్తు క్రమంలో ముఠా సభ్యులను జుబేర్, లుక్మాన్‌దీన్, సద్దాం, ముస్తాక్, ఇద్రిస్‌లుగా గుర్తించారు.

వీరంతా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి 75 ఏటీఎం కార్డులు, రూ.2.91 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, అసోంల్లోని ఏటీఎంల నుంచి ఏడేళ్ల కాలంలో రూ.కోట్ల మేర అక్రమంగా డ్రా చేసినట్లు గుర్తించారు. తెలంగాణాలోని భద్రాద్రి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంల్లో డబ్బు కాజేసినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మేవాఠ్ గ్యాంగ్‌గా(Mewat ATM Gang Arrest) పిలిచే ఈ ముఠాలో 100 మంది వరకు మోసగాళ్లున్నట్లు గుర్తించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ ముఠా తొలిసారిగా పోలీసులకు దొరకడం విశేషం.

Bhadrachalam: 'తాతా ఏటీఎంలో నుంచి నేను డబ్బు తీసిస్తా ఆగు'.. అంటూ

ATM Gang Frauds in Telangana : ఈ ముఠా సభ్యులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, అల్వార్‌ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఏటీఎం కార్డులను తీసుకుంటారు. అయితే నగదును మాత్రం ఆ రాష్ట్రంలోని ఏటీఎంల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేయరు. రాజస్థాన్ నుంచి ప్రతీ 10 రోజులకోసారి విమానాల్లో ప్రయాణించి తాము ఎంచుకున్న ఈ ఆరు రాష్ట్రాలకు వచ్చి హోటళ్లలో బస చేస్తారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా సూటుబూటు ధరిస్తారు. ఎంపిక చేసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల వద్దకు చేరుకుని మోసానికి తెర లేపుతారు.

Interstate Gang was Arrested for withdrawing money from ATMs : ఇద్దరేసి చొప్పున జట్టుగా ఏర్పడుతారు. ఒకరు ఏటీఎం లోపల ఉంటే.. మరొకరు బయట ఏటీఎంకు విద్యుత్తు సరఫరా జరిగే ప్రాంతంలో తిష్ట వేస్తారు. ఏటీఎం కార్డును వినియోగించి నగదు డ్రా చేస్తారు. యంత్రంలో నుంచి డబ్బు తీసుకునే చివరి క్షణంలోనే ఏటీఎంలోకి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. ఇలా చేయడం వల్ల నగదు యంత్రంలోనుంచి బయటికి వస్తుంది కాని ఖాతాలో మాత్రం ఉపసంహరణ జరగదు. ఈ మోసాన్ని వినియోగించి ఇప్పటివరకు కోట్ల రూపాయల నగదును విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా వచ్చిన సొమ్ములో ముఠా సభ్యులతోపాటు ఏటీఎం కార్డుదారులు సగం వాటాలు పంచుకుంటారు.

ATM Theft In KPHB Colony : కేపీహెచ్​బీలోని ఏటీఎంలో భారీ చోరీ.. అతడిపనేనా..!

Hyderabad ATM Thefts Arreste : మరో రకం మోసంలో భాగంగా సీసీటీవీ కెమెరాలు లేని ఏటీఎంలను ఎంచుకుంటారు. వాటిలో నుంచి డబ్బు డ్రా చేస్తారు. కానీ ఏటీఎం కార్డు స్ట్రక్ కావడం వల్ల డబ్బు రాలేదని రాజస్థాన్‌లోని ఏటీఎం కార్డుదారుడితో అక్కడి సొంత బ్రాంచిలో ఫిర్యాదు చేయిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడి బ్యాంకు మేనేజర్‌ తమ ఖాతాదారు ఏటీఎం కార్డు స్ట్రక్ కావడంతో డబ్బు డ్రా చేయలేకపోయారని ఇతర రాష్ట్రంలోని బ్యాంకుకు మెయిల్ పంపిస్తారు. అయితే ఇలా జరిగిన ఘటనల్లో వారం రోజుల్లోపు ఖాతాదారు ఖాతాలో సంబంధిత డబ్బు జమ చేయాలని ఆర్బీఐ నిబంధనలు చెబుతుండటాన్ని మోసగాళ్లు ఇలా తమకు అనువుగా మలుచుకుంటున్నారు. రాజస్థాన్‌లోని ఏటీఎం కార్డు కావడంతో ఇలా స్ట్రక్ అయినట్లు అందిన ఫిర్యాదులపై విచారణ చేయడంలో ఇతర రాష్ట్రాల బ్యాంకుల్లో తాత్సారం జరుగుతుండటం మోసగాళ్లకు కలిసివస్తోందని పోలీసులు దర్యాప్తులో తేలింది.

Himayatnagar ATM Theft Update : పెప్పర్‌ స్ప్రే కొట్టి ఏటీఎం చోరీ.. కేరళలో నిందితుల అరెస్ట్

లారీలో వచ్చి ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. మెషీన్ బద్దలు కాలేదని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.