రేపు హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలను నిలిపివేయనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆపివేస్తున్నారు. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ మాల్స్‌ను కూడా మూసేవేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీయస్రెడ్డి తెలిపారు.
ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: దేశంలో 258కి చేరిన కరోనా కేసుల సంఖ్య