ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పొడిగించారు. ఉదయం 6 గంటలకు తొలి మెట్రో ట్రైన్ ప్రారంభం కాగా.. చివరి రైలు రాత్రి 10.15కు బయలుదేరనుంది. ఉదయం 6 గంటల నుంచి తొలి మెట్రో రైలు ప్రారంభం కావడంతో పలు మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిలాడాయి.
మెట్రో ట్రైన్ సేవలు పొడిగించాలని ట్విట్టర్ ద్వారా అభినవ్ అనే ఓ ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆ అంశాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ మార్పులు చేశారు.
కరోనా సమయంలో కొద్ది రోజులు మెట్రో సేవలు నిలిచిపోవడంతో నష్టాలు వచ్చాయి. లాక్‌డౌన్ ముగిసిన తరువాత కొద్ది రోజుల పాటు మెట్రో రైలు తక్కువ సమయం నడవడంతో ఆదాయం అంతగా రాలేదు. కొవిడ్ ప్రభావం అంతగా లేకపోవడం, కార్యాలయాలు అన్నీ తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే మెట్రోకు ఆదాయం వస్తోంది. ఇప్పుడు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి నడపడంతో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు మెట్రో వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: Yadadri Hundi Money Counting: యాదాద్రీశుని 21 రోజుల ఆదాయం ఎంతంటే?