హైదరాబాద్‌ను ట్రాఫిక్, కాలుష్యం వెంటాడుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. వీటి నుంచి నగర ప్రజలను కాపాడేందుకు.. ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించేందుకు వివిధ రకాల ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో ఎన్నో యాప్‌లు తెచ్చిందని గుర్తుచేశారు.
ఇప్పుడు ఆర్-పూల్‌తో కలిసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి పేర్కొన్నారు. కార్‌పూల్, బైక్ పూల్ సర్వీసులను రెడ్‌బస్ సీఈవో శ్రీ ప్రకాశ్ సింగంతో కలిసి హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెట్రోలో ప్రయాణించవచ్చని తెలిపారు.
ఈ ఆర్-పూల్‌తో రెడ్‌బస్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ఈ విధానం ద్వారా ఒక కిలోమీటరకు రెండు రూపాలయలు ఛార్జ్ చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు