తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, మహంకాళి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రూపు రాజకీయాలు చేస్తే పార్టీకే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. నమోదు పూర్తిచేయడానికి జులై 20 వరకు ముఖ్యమంత్రి సమయం ఇచ్చినప్పటికీ 15లోగానే పూర్తి చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆకుల రూప, కుర్మా హేమలత, తరుణి, శేషుకుమారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జులై 10 వరకు సమయమిస్తున్నా... స్వచ్ఛందంగా తప్పుకోవాలి