ETV Bharat / state

నిరాడంబరంగా మెగాస్టార్​ చిరంజీవి జన్మదిన వేడుకలు - chiranjeevi birthday celebrations

మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు నిరాడంబరంగా జరిపారు. సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

megastar chiranjeevi birthday celebrations in hyderabad
నిరాడంబరంగా మెగాస్టార్​ చిరంజీవి జన్మదిన వేడుకలు
author img

By

Published : Aug 22, 2020, 2:11 PM IST

మెగాస్టార్​ చిరంజీవి జన్మదిన వేడుకలను హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​రోడ్డులోని సంధ్య థియేటర్​లో ఆయన అభిమానులు నిరాడంబరంగా జరిపారు. సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరు ఉద్యోగులను అందరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బందికి కొణిదెల యువసేన ఆర్టీసీ క్రాస్ రోడ్డు కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. కొవిడ్​-19 దృష్ట్యా ఉపాధి కోల్పోయిన సినిమా థియేటర్ సిబ్బందికి కమిటీ ప్రతినిధులు బాబు, నాగరాజు, నరేష్​లు నిత్యావసర సరకులను పంపిణీ చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని ఆయన అభినందించారు.

ఇవీ చూడండి: మెగాస్టార్.. మీరే మా స్ఫూర్తి, ధైర్యం ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.