ETV Bharat / state

మెగా డీఎస్సీపై కసరత్తు - ఖాళీల లెక్క తేలుస్తున్న అధికారులు - తెలంగాణ మెగా డీఎస్సీ 2024

Mega DSC Notification Telangana 2024 : రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో, మెగా డీఎస్సీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5089 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడగా, ప్రస్తుతం ఉన్నవారికి పదోన్నతులు కల్పిస్తే మరో 9000లు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా 19,000ల నుంచి 20,000ల ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది.

Telangana Mega DSC 2024
Telangana Mega DSC 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 8:50 AM IST

మెగా డీఎస్సీపై విద్యాశాఖ కసరత్తు

Mega DSC Notification Telangana 2024 : మెగా డీఎస్సీ నిర్వహణపై, విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరంటూ మూసివేసిన చోట అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తిచేసి, తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించడంతో అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి డీఎస్సీ నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.

Education Department On TS DSC 2024 : శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షలో, ఖాళీలు, ఉపాధ్యాయులులేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకి చెందిన అంశాలను అధికారులు ఆయనకు నివేదించారు. గతప్రభుత్వ హయాంలో 5089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీచేశారు. అప్పుడు స్కూల్‌అసిస్టెంట్‌ 1739, భాషాపండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, ఎస్జీటీ 2575 పోస్టులు ఖాళీలుగా చూపారు. గత ఏడాది ఆగస్ట్ వరకు ఆ పోస్టులు లెక్కతేలాయి.

Teacher promotions Postpone Telangana : టీచర్లకు షాకింగ్ న్యూస్.. పదోన్నతులకు బ్రేక్​.. ఎందుకంటే!

టెట్‌ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా, ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల (Telangana Teachers Transfer ) ప్రక్రియ నిలిచిపోయిఉంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు, టెట్‌ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9000ల వరకు ఖాళీలు తేలే అవకాశం ఉంది. వాటన్నింటినీ డీఎస్సీ చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులనూ కలపాల్సిఉంటుంది. ఆ లెక్కన 19,000ల నుంచి 20,000ల వరకు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

Telangana Mega DSC Notification 2024 : డీఎస్సీ నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తిచేసి, సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక తేదీలపై స్పష్టత రానుంది. తొలుత ఉపాధ్యాయ పదోన్నతులకోసం విధిగా టెట్‌ (Telangana TET) నిర్వహించాల్సి ఉంటుంది. టెట్‌ నిర్వహణలో జాప్యంఉంటే, పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి, వాటినీ కలిపి డీఎస్సీ నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మసకబారుతున్న ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిష్ఠ - డిప్యుటేషన్లు, ఫారిన్‌ సర్వీస్‌ల పేరిట ఏళ్ల తరబడి తిష్ఠ

సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు 1,72,000ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వీలుంది. ఆ లోగా డీఎస్సీ నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కొనసాగించి, పోస్టులు, గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు చేపడుతున్నామని, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం (Education Principal Secretary Burra Venkatesham) తెలిపారు. కాలవ్యవధితో పూర్తయ్యేలా మెగాడీఎస్సీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

త్వరలోనే మెగా డీఎస్సీ - 9,800 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్లాన్!

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.