ETV Bharat / state

Medical Checkup in ESI Hospital : ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆ కార్మికులకు వైద్య పరీక్షలు!

Medical Checkup in ESI Hospital :ఈఎస్​ఐ ఆస్పత్రులు(ESI medical benefits), డిస్పెన్సరీల్లో 40 ఏళ్లకు పైబడిన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్మికులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసి.. ఈ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేసి ఈ-ఆరోగ్య రికార్డులు సిద్ధం చేయనున్నారు. అర్హులైన వారంతా ఈ సేవలు వినియోగించుకోవాలని ఈఎస్​ఐ కోరింది.

author img

By

Published : Nov 28, 2021, 8:49 AM IST

medical tests in ESI hospital, ESI medical benefits
ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో 40 ఏళ్లు దాటిన కార్మికులకు వైద్య పరీక్షలు

Medical Checkup in ESI Hospital : కార్మిక రాజ్య బీమా పరిధిలోకి వచ్చే కార్మికులకు ఆరోగ్య రికార్డులు నిర్వహించాలని ఈఎస్‌ఐసీ నిర్ణయించింది. 40 ఏళ్లు నిండినవారందరికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేసి ఈ-ఆరోగ్య రికార్డులు సిద్ధం చేయనుంది. ఈమేరకు వార్షిక ముందస్తు ఆరోగ్యపరీక్షల విధానాన్ని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని ఈఎస్‌ఐసీ, బీమా వైద్యసేవల ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అర్హులైన కార్మికులందరూ ఈ సేవలు వినియోగించుకోవాలని కోరింది. రాష్ట్రంలో 63,510 కర్మాగారాలు, సంస్థల పరిధిలోని 17 లక్షలమంది ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నారు. వారి కుటుంబాల్లోని 75 లక్షలమందికి బీమా సౌకర్యం(esic medical benefits eligibility) వర్తిస్తోంది. ఏటా 3.5 లక్షలమంది వైద్య చికిత్సలు, ఇతర ఆసుపత్రుల్లో వైద్యానికి రిఫరల్‌ విధానం ఉపయోగించుకుంటున్నారు.

ఎందుకీ పరీక్షలు?

health checkup of workers 40 years above under ESI : బీమా పరిధిలోకి వచ్చే కార్మికులు కొందరు ప్రమాదకరమైన పరిశ్రమలు, వాతావరణంలో పనిచేస్తున్నారని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ గుర్తించింది. సాధారణ వైద్యపరీక్షలు చేస్తున్నప్పటికీ, ఏడాదికోసారి ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ అవసరమని నిర్ణయించింది.

ఏ పరీక్షలు చేస్తారు?

రక్తం, మధుమేహం, మూత్రం, కాలేయం, మూత్రపిండాల పనితీరు, ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ.

పరీక్ష చేశాక ఏంచేస్తారు?

ఏవైనా రుగ్మతల లక్షణాలు బయటపడితే కార్పొరేషన్‌ తరఫున వెంటనే ఔషధాల పంపిణీ చేయడంతో పాటు అత్యవసరమైతే చికిత్సలకు సిఫారసు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.